31, జులై 2010, శనివారం

ప్రజలకు విన్నవం - కరపత్రం

From Pamphlets
పచ్చదనం పెంపొందించేందుకు మేము చేసే ప్రయత్నాలకు ప్రజల సహకారం తోడయినప్పుడే, సమాజంలో హరితాన్ని నింపగలం. ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేదిశగా ఈ కరపత్రాలను ముద్రించాము.

22, ఏప్రిల్ 2010, గురువారం

నేడు ధరిత్రీ దినోత్సవం - World Earthday

ప్రపంచంలో ప్రతివ్యక్తి తన జీవితకాలం అంతా సుఖవంతంగా జీవించడానికే ప్రాముఖ్యతనిస్తాడు.ఈ క్రమంలో పరిమిత జ్ఞానం కారణంగా, అవగాహన లేమితో సుఖవంతమైన జీవితానికి సోపానాలు అనుకుంటూ, నరక ప్రాయమైన అగాధాలలోకి అడుగులు వేస్తున్నాడు.

ప్రతి వ్యక్తి తన వంతు హక్కులతో బాటుగా బాధ్యతలను కూడా నిర్వర్తించాలి. ఇది సంఘ జీవనం యొక్క ప్రాధమిక సూత్రం. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల వాంగ్మయ సారం కూడా యిదే. వ్యక్తి స్థాయి నుంచి సమాజ నిర్దేశకుల వరకు అందరూ సమిష్టిగా తమవంతు బాధ్యతను నిర్వర్తిస్థేనే సమాజ హితం సాధ్యమౌతుంది.

మనిషికి స్వార్ధం అనేది ఆదినుంచీ ఉంది. అయితే దీని మూలంగా మానవాళికి నష్టం మాత్రం ఈ మధ్య కాలం (గత కొన్ని శతాబ్దాల) నుంచే మొదలైంది. జనాభా పెరుగుదల, మనిషి శక్తి సామర్ధ్యాల పెరుగుదల, సమాజాల మధ్య వైరుధ్యాల పెరుగుదల కారణంగా, ఈ స్వార్ధం పర్యావరణానికి హాని చేసి, సుఖవంతమైన జీవనానికి చేటు తెచ్చే స్థాయిలో స్థిరపడింది.

ఏ ఒక్కరిని కదిపినా పది, ఇరవై లేదా ముప్ఫై సంవత్సరాల క్రితంతో పోలిస్తే పరిస్థితులు యెంత నరకప్రాయమౌతున్నయో, పర్యావరణ మార్పుల ఫలితంగా ఆవరిస్తున్న దైన్యం గురించి చెబుతారు. మనం మన బాధ్యత గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఆ మంచి మార్పు కోసం, మన మంచి కోసం...

మా ఈ ప్రయత్నమంతా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గుర్తెరిగేలా చేయటం, అవగాహన కల్పించటం, మన పర్యావరణాన్ని ఆహ్లాదకరంగా మన భావితరాలకు అందేందుకు మా పరిధిలో చేస్తున్న చిన్న కృషి మాత్రమే...

17, జనవరి 2010, ఆదివారం

త్వరలొ మీ ముందుకు వస్తున్నాం...

బ్లాగ్ కు కావలసిన సమాచారం క్రోడీకరిస్తున్నాం, దయచేసి కొద్దికాలం ఓపిక పట్టండి...